విడుదల తేదీ : 19 ఏప్రిల్ 2013
TeluguWorld.wap.sh : 3/5
దర్శకుడు : మణిమారన్
నిర్మాత : సుబ్రహ్మణ్యం, సురేష్
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
నటీనటులు : సిద్దార్థ్, ఆశ్రిత శెట్టి, కెకె మీనన్ …
లవర్ బాయ్ సిద్దార్థ్ హీరోగా ఆశ్రిత శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ‘ఎన్ హెచ్ 4′. ‘బెంగుళూరు టు చెన్నై’ అనేది ఈ సినిమాకి ఉప శీర్షిక. మణిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎక్కువ భాగం హైవేలో షూట్ చేసిన ఈ లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ బ్యానర్ వారు తెలుగు ప్రేక్షకులకి అందించారు. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. గత కొంత కాలంగా సరైన హిట్ లేక డీలాపడిపోయిన్న సిద్దార్థ్ కెరీర్ కి ఈ సినిమా ఎంత వరకూ హెల్ప్ అయ్యింది, సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం…
కథ :
స్వతహాగా అనంతపూర్ కి చెందిన ప్రభు(సిద్దార్థ్) తన డిగ్రీ కంప్లీట్ చెయ్యడానికి, మరో ఐదుగురు ఫ్రెండ్స్ తో కలిసి బెంగళూరు వచ్చి అక్కడ కాలేజీలో చేరుతాడు. అదే కాలేజీలో చదువుతున్న రితిక(ఆశ్రిత శెట్టి) ప్రభు బిహేవియర్, ఎదుటి వారికి సహాయం చేసే అతని మనస్తత్వం చూసి అతనితో ప్రేమలో పడుతుంది. ఇలా ఇద్దరూ ప్రేమించుకుంటున్న సమయంలో వీరిద్దరి విషయం ఫేమస్ పొలిటీషియన్ అయిన రితిక తండ్రికి తెలుస్తుంది. దాంతో వారిద్దరి ప్రేమ అలాగే కొనసాగితే తన రాజకీయ జీవితానికి ప్రమాదం అని వారిద్దరినీ విడదీయాలని ప్రయత్నిస్తాడు.
అది తెలుసుకున్న ప్రభు, రితిక అతని ఫ్రెండ్స్, క్రిమినల్ లాయర్ అయిన అతని భావ సాయంతో పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అలా పారిపోయిన వారిని పట్టుకోవడానికి రితిక ఫాదర్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయిన మనోజ్ మీనన్(కెకె మీనన్) ని రంగంలోకి దింపుతాడు. ఒక పక్కా ప్లాన్ తో పారి పోదామనుకున్న ప్రభు – రితికలని మనోజ్ మీనన్ పట్టుకున్నాడా? లేదా? ఈ చేజింగ్ లో ఏమేమి సంఘటనలు జరిగాయి? అనేదే మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఎక్కువ సినిమాల్లో లవర్ బాయ్ గా కనిపించిన సిద్దార్థ్ ఈ సినిమాలో కాస్త మాస్ పాత్రలో కనిపించాడు. పాత్రకి తగ్గట్టే అతని నటన బాగుంది. ఆశ్రితా శెట్టి అటు మోడ్రన్ గా, ఇటు క్లాస్ లుక్ లో అందంగా ఉంది. ఆమె నటనతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. కె.కె మీనన్ పోలీస్ ఆఫీసర్ పాత్రకి పర్ఫెక్ట్ గా సరిపోయారు. అంత సీరియస్ పాత్రలో కూడా అక్కడక్కడా కాస్త నవ్వించారు.
కాలేజ్ ఎపిసోడ్ లో ఫ్రెండ్స్ మధ్య వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. సిద్దార్థ్ – ఆశ్రితా శెట్టి మధ్య రొమాంటిక్ ట్రాక్ బాగుంది అలాగే సిద్దార్థ్ – రితిక ల మధ్య వచ్చే ‘నీవెవరో’ పాట బాగుంది. సినిమాలో పోలీస్ డిపార్ట్ మెంట్ శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించుకొని హీరో ప్లాన్స్ ని తెలుసుకోవడం, వారి ప్లాన్స్ తిప్పికొట్టి వాటికి మించి హీరో వేసే ప్లాన్స్ బాగున్నాయి కానీ వాటిని టెక్నికల్ గా ఇంకాస్త ఎఫ్ఫెక్టివ్ గా చూపించి ఉంటే బాగుండేది. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ బాగుంది.
మైనస్ పాయింట్స్ :
వెట్రి మారన్ సినిమా కోసం ఎంచుకున్న కథ చాలా రొటీన్ గానే ఉన్నా డైరెక్టర్ కొత్త స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులని ఆకట్టుకోవాలనుకున్నాడు. కానీ అనుకున్నట రేంజ్లో తీయలేకపోయాడు. యాక్షన్ థ్రిల్లర్ సినిమా అంటే ప్రేక్షకుల్లో నెక్స్ట్ ఏం జరుగుతుంటా, ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగి ఉంటుందా అనే ఉత్కంఠతని కలుగ చేయాలి కానీ ప్రేక్షకుల్లో ఉత్కంఠతని కలిగించడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడనే చెప్పుకోవాలి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తాన్ని ఒక్క సారి చూపించకుండా ఒక్కొక్క సందర్భంలో ఒక్కోలా రివీల్ చెయ్యడం బాగానే ఉంది కానీ ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ పార్ట్ పూర్తయ్యేటప్పటికే ఏం జరిగిందో, ఇక ముందు ముందు ఏం జరిగుంతుందా అని ప్రేక్షకులు చాలా వరకూ ఊహించేయగలరు, దాంతో సస్పెన్స్ ఏమీ ఉండదు.
సినిమా ఫస్ట్ హాఫ్ లో మొదటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలయ్యేంత వరకూ సినిమా నిధానంగా సాగుతుంది. ఆ తర్వాత కాస్త పరవాలేదనిపిస్తుంది కానీ అంత వేగంగా అయితే ముందుకు వెళ్ళదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒకటి అరా చేజింగ్ సీన్స్ ఉంటాయి, మిగతా అంతా బార్లు, పబ్బులు లాంటివి చూపించి ప్రేక్షకులకు బోర్ కొట్టించారు. సెకండాఫ్ లో సినిమాలో చేజింగ్ సీన్స్ ఉన్నాయి కదా అని ఒకరి రెండు ఫైట్స్ పెడితే బాగుంటుందేమో అనుకొని సెకండాఫ్ లో వచ్చే ఫైట్స్ పెట్టినట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ నిదానగా సాగడం, అలాగే ఊహించే విధంగా ఉంటుంది. సిద్దార్థ్ ఈ సినిమాలో కూడా లవర్ బాయ్ పాత్ర చేసాదేమో అనుకోని వెళితే మాత్రం నిరుత్సాహానికి గురవుతారు.
సాంకేతిక విభాగం :
వేల్ రాజ్ సినిమాటోగ్రఫీలో కొన్ని రొమాంటిక్ సీన్స్ తప్పితే మిగతా ఏ సీన్ లో చెప్పుకోదగ్గ పనితనం కనిపించలేదు. ఎడిటింగ్ పరవాలేదు ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ ని కత్తిరించేస్తే ప్రేక్షకులు హ్యాపీ గా ఫీలవుతారు. జి.వి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ లో ‘నీవెవరో’ పాట తప్ప ఇంకేవీ బాగోలేవు, అలాగే యాక్షన్ సీన్స్ లో తప్ప మిగతా సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. డైలాగ్స్ డీసెంట్ గా ఉన్నాయి.
కథ – స్క్రీన్ ప్లే విషయంలో వెట్రి మారన్ – మణిమారన్ లు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. డైరెక్షన్ పరంగా మణిమారన్ యావరేజ్ మార్కులు మాత్రమె సంపాదించుకోగాలిగాడు. నిర్మాణ విలువలు అంతంత మాత్రంగా ఉన్నాయి.
తీర్పు :
సిద్దార్థ్ లవర్ బాయ్ గా కాకుండా కాస్త కొత్తగా ట్రై చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఆశించినంత స్థాయిలో లేదు. ఫస్ట్ హాఫ్ కాస్త నిదానంగా సాగడం, ఆసక్తికరంగా లేకపోవడం, రిపీట్ గా అనిపించే కొన్ని సన్నివేశాలు చెప్పదగిన మైనస్ పాయింట్స్. సినిమాలో చూపించే కొన్ని టెక్నికల్ పాయింట్స్, సిద్దార్థ్, ఆశితా శెట్టి, కెకె మీనన్ నటన చెప్పదగిన ప్లస్ పాయింట్స్. ఎక్కువగా అంచనా వేసుకొని ఈ సినిమాకి వెళ్లకపోతే మీకు ఈ సినిమా యావరేజ్ గా అనిపిస్తుంది.